మోడల్’ బడుల ముస్తాబు
వచ్చే విద్యా సంవత్సరంలో 355 ప్రారంభం
7,100 టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు పూర్తి
ఏప్రిల్‌లో నియామకం.. జూన్ నుంచి తరగతులు
2014-15 నుంచి మరో 254 మండలాల్లో స్కూళ్లు
వచ్చే విద్యా సంవత్సరంలో 355 ప్రారంభం
7,100 టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు పూర్తి
ఏప్రిల్‌లో నియామకం.. జూన్ నుంచి తరగతులు
2014-15 నుంచి మరో 254 మండలాల్లో స్కూళ్లు
హైదరాబాద్, జనవరి 1 : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటంతోపాటు బాలికల్లో అక్షరాస్యత పెంపొందించే లక్ష్యంతో 2013-14 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 355 మో డల్ పాఠశాలలను ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమవుతోంది. వీటిల్లో ఇంగ్లీషు మాధ్యమంలోనే తరగతులు నిర్వహిస్తారు. ముఖ్యంగా మహిళా అక్షరాస్యత తక్కువగా ఉన్న వెనుకబడిన మండలాల్లోనే ఈ పాఠశాలలను ప్రారంభిస్తారు.
ఒక్కో మోడల్ పాఠశాలపై రూ.3.02 కోట్లు వ్యయం చేస్తున్నారు. ఈ మొత్తంతో పాఠశాల భవన నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ప్రయోగశాల, గ్రంథాలయం ఏర్పా టు చేస్తారు. మొదటి దశలో భాగంగా 355 మోడల్ పాఠశాలల కోసం 7,100 మంది ఉపాధ్యాయులను ఏప్రిల్‌లో నియమించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఒక్కో పాఠశాల ఆవరణలో రూ.1.28 కోట్ల వ్యయంతో బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మోడల్ పాఠశాలల కోసం అయ్యే మొత్తం ఖర్చులో 75 శాతం కేంద్ర ప్రభుత్వం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే ఈ మోడల్ పాఠశాలలు జూన్ రెండో వారంలోనే ప్రారంభం అవుతాయి. 2013-14 విద్యా సంవత్సరంలో 6,7,8 తరగతులతో పాటు జూనియర్ ఇంటర్ ప్రారంభిస్తారు. 2014-15 విద్యా సంవత్సరం నుంచి కేవలం ఆరో తరగతి, జూనియర్ ఇంటర్ ప్రవేశాలను నిర్వహిస్తారు. అధికారిక సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు 200 మోడల్ పాఠశాలల భవనాల నిర్మాణం పూర్తయింది. వాటిలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
మిగిలిన పాఠశాలలకు సంబంధించిన భవనాల నిర్మా ణం తుది దశకు చేరుకుంది. కేవలం 14 పాఠశాలల భవనాల నిర్మాణం కోర్టు కేసు కారణంగా నిలిచిపోయింది. మరోవైపు మహిళా అక్షరాస్యత తక్కువగా ఉన్న మరో 254 మండలాల్లో 2014-15 విద్యా సంవత్సరంలో మోడల్ పాఠశాలలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా అనుమతి ఇచ్చింది.
No comments:
Post a Comment